భూపాలపల్లి అర్బన్: మున్సిపాలిటీ పరిధి వేశాలపల్లి శివారు డబుల్‌బెడ్ రూం కాలనీలో తాగునీటి ఇబ్బందులను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం కాలనీవాసులు కలెక్టరేట్ ఎదుట ఖాళీబిందెలతో నిరసన చేపట్టారు. క్వాటర్స్ కేటాయించిన నాటినుంచి ఇప్పటివరకు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని, సొంత డబ్బులతో మోటార్లు, పైపులైన్లు ఏర్పాటు చేసుకొని నీటివసతి కల్పించుకున్నట్లు తెలిపారు. రెండేళ్లుగా అఽధికారులు తమ సమస్యలను పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. వేసవికాలం కావడంతో ప్రస్తుతం ఉన్న బోర్లు పనిచేయడం లేదన్నారు. మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయాలని కోరారు. ధర్నా అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అంద జేశారు.