పట్టుదలతో ఏదైనా సాధ్యమే | - | Sakshi
Sakshi News home page

పట్టుదలతో ఏదైనా సాధ్యమే

Mar 9 2025 1:37 AM | Updated on Mar 9 2025 1:35 AM

అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి అఖిల

భూపాలపల్లి అర్బన్‌: మహిళలు ఇంట్లో అందరికీ అన్ని పనులు చేస్తున్నారని.. తన కోసం పట్టుదలతో చేస్తే ఏదైనా సాధ్యమేనని అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి అఖిల తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగరేణి ఆధ్వర్యంలో శనివారం ఏరియాలోని ఇల్లంద్‌క్లబ్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్క మహిళ ఇంట్లో కూర్కోకుండా ఏదో ఒకటి సాధించే ప్రయత్నం చేయాలని కోరారు. ప్రయత్న లోపం లేకుండా ఒక్క అడుగు ముందుకు వేస్తే అదే వారిని వారి లక్ష్యం వైపు నడిపిస్తుందని తెలిపారు. సాధించిన విజయంలో తల్లిదండ్రులు లేదా భర్త ప్రోత్సాహం ఉంటుందన్నారు. సింగరేణి ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. సింగరేణి సంస్థలో అండర్‌ గ్రౌండ్‌లో పనిచేయాలని మహిళా ఉద్యోగులు సంస్థలో చేరుతున్నారని వారిని అభినందించారు. వారికి కావాల్సిన అన్ని సదుపాయాలను ఏర్పాటు చేస్తామన్నారు. మహిళలు మరింత ముందుకు రావాలని సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో సేవా అధ్యక్షురాలు సునీతరాజేశ్వర్‌రెడ్డి, ఏసీఎంఓ డాక్టర్‌ పద్మజ, సీఎంఓఏఐ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, కార్మిక సంఘాల నాయకులు శ్రీనివాస్‌, శేషరత్నం, అధికారులు మారుతి, క్రాంతికుమార్‌, శ్రావణ్‌కుమార్‌, శ్రీనివాస్‌, సేవా సభ్యులు పాల్గొన్నారు.

పట్టుదలతో ఏదైనా సాధ్యమే1
1/1

పట్టుదలతో ఏదైనా సాధ్యమే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement