11శాతం రిజర్వేషన్లు వర్తింపజేయాలి | - | Sakshi
Sakshi News home page

11శాతం రిజర్వేషన్లు వర్తింపజేయాలి

Mar 6 2025 1:54 AM | Updated on Mar 6 2025 1:50 AM

భూపాలపల్లి రూరల్‌: ఎస్సీ వర్గీకరణలో మాదిగ ఉపకులాలకు 11 శాతం రిజర్వేషన్లు వర్తింపజేయాలని ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్‌పీ జిల్లా ఇన్‌చార్జ్‌ అంబాల చంద్రమౌళి మాదిగ డిమాండ్‌ చేశారు. బుధవారం డప్పుచప్పుళ్లతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో 11 శాతం రిజర్వేషన్లు ఆమోదింప చేయాలని, మాదిగ, మాదిగ ఉపకులాలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలన్నారు. లేదనంటే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్‌పీ జిల్లా, మండలాల నాయకులు దోర్నాల రాజేందర్‌ మాదిగ, అంతడుపుల సురేష్‌, దోర్నాల సారయ్య, నేర్పాటి అశోక్‌, మంద తిరుపతి, మడిపల్లి సుమన్‌ తదితరులు పాల్గొన్నారు.

దొంగనోట్ల కలకలం!

రేగొండ: కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో దొంగనోట్ల కలకలం రేపుతోంది. మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో మహిళా సంఘంలోని ఓ గ్రూపునకు చెందిన మహిళ నెలవారి కీస్తీలు డిపాజిట్‌ చేయడానికి వెళ్లింది. ఈ క్రమంలో నగదును క్యాషియర్‌ లెక్కిస్తుండగా అందులో ఓ 500 రూపాయల నోటు దొంగ నోటుగా గుర్తించారు. దీంతో సంఘ సభ్యులు ఎవరు ఇచ్చారనేది స్పష్టత రాకపోవడంతో మండలంలో దొంగ నోట్ల హవాసాగుతుందని మండల ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement