యాజమాన్యం దృష్టికి కార్మికుల సమస్యలు | - | Sakshi
Sakshi News home page

యాజమాన్యం దృష్టికి కార్మికుల సమస్యలు

Mar 5 2025 1:24 AM | Updated on Mar 5 2025 1:21 AM

భూపాలపల్లి అర్బన్‌: సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఐఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్‌ప్రసాద్‌ ఎప్పటికప్పుడు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తున్నాడని యూనియన్‌ ఉపాధ్యక్షుడు జోగు బుచ్చయ్య తెలిపారు. మంగళవారం ఏరియాలోని వర్క్‌షాపులలో కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్మికులకు సొంతింటి పథకం వెంటనే అమలు చేయాలని, మారు పేర్లను సవరించాలని, క్యాడర్‌లకు సంబంధించిన క్యాడర్‌ స్కీం అమలు చేయాలని, ప్లేడేలను గతంలో మాదిరిగా అమలు చేసి ఎన్‌–1 రద్దు చేయాలని సీఎండీని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుమార్‌, రాజిరెడ్డి, బాబు మియా, సుధాకర్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ

స్థల పరిశీలన

భూపాలపల్లి అర్బన్‌: గడ్డిగానిపల్లి, కొండంపల్లి గ్రామాల ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ భూ సేకరణ పనులను మంగళవారం ఆర్డీఓ రవి సింగరేణి అధికారులతో కలిసి పరిశీలించారు. గడ్డిగానిపల్లి, కొండంపల్లి భూసేకరణ పనులను త్వరగా పూర్తిచేసి ఈ ప్రాంత ప్రజలకు పునరావాస కేంద్రాలను అన్ని వసతులతో సిద్ధం చేయాలని సింగరేణి అధికారులను ఆర్డీఓ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీఎం ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి, ఓసీ–2 ప్రాజెక్ట్‌ అధికారి వెంకటరామిరెడ్డి, సివిల్‌ డీజీఎం రవికుమార్‌, అధికారులు అరుణ్‌ప్రసాద్‌, కార్తీక్‌ పాల్గొన్నారు.

వైద్య సిబ్బంది పాత్ర గొప్పది

కాటారం: వైద్యసేవలు ప్రజలకు చేరవేయడంలో వైద్యసిబ్బంది పాత్ర చాలా గొప్పదని వైద్యశాఖ జిల్లా ప్రోగ్రామ్‌ అధికారి డాక్టర్‌ ఉమాదేవి అన్నారు. జన్‌ఔషధి వారోత్సవాల్లో భాగంగా మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉత్తమ విధులు నిర్వర్తిస్తున్న ట్రైబల్‌ వెల్ఫేర్‌ స్టాఫ్‌ నర్స్‌ అభినయను సన్మానించారు. ఈ సందర్భంగా ఉమాదేవి మాట్లాడుతూ ఏఎన్‌ఎం, వైద్య సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్‌ మౌనిక, డాక్టర్‌ హారిక, డాక్టర్‌ వందన, డాక్టర్‌ ప్రియాంక, డాక్టర్‌ గీతా, డాక్టర్‌ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

టెక్నాలజీపై అవగాహన

మల్హర్‌: మండలంలోని తాడిచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఏర్పాటు చేసిన 108 అంబులెన్స్‌ అత్యాధునిక పరికరాల టెక్నాలజీపై ఉమ్మడి జిల్లా 108 ప్రోగాం మేనేజర్‌ పాటి శివకుమార్‌ అవగాహన కల్పించారు. తాడిచర్ల ఆరోగ్య కేంద్రంలో సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు, ఆశకార్యకర్తలు, సిబ్బందితో మంగళవారం వైద్యాధికారి వినయ్‌ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శివకుమార్‌ మాట్లాడుతూ.. 108, 102 సర్వీస్‌లు, నియో నటల్‌ సేవలు ఎఫ్‌హెచ్‌ఎస్‌ (పార్థివ వాహనం) సర్వీస్‌ ఉపయోగించుకోవాలని అవేర్నెస్‌ డెమో ప్రోగ్రాం ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మేనేజర్‌ మెరుగు నరేష్‌ యాదవ్‌, పీహెచ్‌సీ తాడిచర్ల హెల్త్‌ అసిస్టెంట్‌ నాగరాజు, ఆశకార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, 108 సిబ్బంది, ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌ మహేష్‌, పైలట్‌ సంపత్‌ పాల్గొన్నారు.

యాజమాన్యం దృష్టికి కార్మికుల సమస్యలు
1
1/2

యాజమాన్యం దృష్టికి కార్మికుల సమస్యలు

యాజమాన్యం దృష్టికి కార్మికుల సమస్యలు
2
2/2

యాజమాన్యం దృష్టికి కార్మికుల సమస్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement