రేగొండ: ప్రజల వద్దకు పోస్టాఫీస్ సేవల కార్యక్రమంలో భాగంగా పరకాల ఏఎస్పీ అనంత్‌రామ్ నాయక్ శనివారం కొత్తపల్లిగోరి మండలంలోని రాజక్కపల్లి, చిన్నకోడేపాక, చెన్నాపూర్ గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆసరా పెన్షన్, ఉపాధిహామీ నగదును లబ్ధిదారులకు అందజేశారు. నిస్సహాయక పెన్షన్‌దారులు కొండెటి సూరమ్మ ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోస్టాఫీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రూ.755లకు రూ.15 లక్షల ప్రమాదబీమా సౌకర్యాన్ని ప్రజలు ఉపఝెగించుకోవాలని అన్నారు. తపాలాశాఖ మినీ ఏటీఎం సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయన వెంట తపాలా సిబ్బంది సంతోష్, కృష్ణ ఉన్నారు.