ప్రైవేటీకరణ నిలిపేవరకు పోరాటాలు | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటీకరణ నిలిపేవరకు పోరాటాలు

Feb 27 2025 2:08 AM | Updated on Feb 27 2025 2:07 AM

భూపాలపల్లి అర్బన్‌:ఏరియాలో సింగరేణి గనుల ప్రైవేటీకరణను నిలిపేవరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని యూనియన్‌ బ్రాంచీ కార్యదర్శి మోటపలుకుల రమేశ్‌ తెలిపారు. కేటీకే ఓసీ–3 అండర్‌గ్రౌండ్‌ 2వ సీమ్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బుధవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏరియాలోని అన్ని గనుల అధికారులకు వినతిపత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా రమేశ్‌ మాట్లాడుతూ.. గని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. దీంతో డిపెండెంట్‌ ఎంప్లాయీమెంట్‌ తగ్గిపోవడమే కాకుండా సంస్థ ఆర్థిక నష్టాల్లో కూరుకు పోతుందన్నారు. కొత్తగనుల ఏర్పాటు లేకపోవడంతో సింగరేణి సంస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందన్నారు. నైపుణ్యం కలిగిన కార్మికులు, టెక్నీషియన్లు, అధికారులు ఉండి 130 సంవత్సరాల చరిత్ర ఉన్న సంస్థ ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో పెట్టి నిర్వీర్యం చేస్తుందన్నారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు సదయ్య, తిరుపతి, కరిముల్లా, శ్రీను, చంద్రమౌళి, జగత్‌రావు, కృష్ణారెడ్డి, హరీష్‌, శ్రీకాంత్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement