వాతావరణం | - | Sakshi
Sakshi News home page

వాతావరణం

Feb 25 2025 1:44 AM | Updated on Feb 25 2025 1:44 AM

ఎరుపెక్కిన ఏనుమాముల..
వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ సోమవారం మిర్చితో ఎరుపెక్కింది. రైతులు భారీ మొత్తంలో మిర్చిని తీసుకొచ్చారు.
జిల్లాలో ఉదయం ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోత, ఎండ ఎక్కువగా ఉంటుంది. రాత్రి చల్లగాలులు వీస్తాయి.

8లోu

● పెద్దపల్లి జిల్లా బోయినిపల్లికి చెందిన సోరుపాక వీరమ్మ ఈ నెల 19న టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామానికి కాలినడకన వస్తున్న క్రమంలో గ్రామ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేసి మెడలో ఉన్న బంగారం ఎత్తుకెళ్లారు. మృతురాలిని గోనె సంచిలో కుక్కి వ్యవసాయ బావిలో పడేశారు. ఐదు రోజుల తరువాత బావి వద్ద దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

● జనవరి 26వ తేదీన మండలంలోని కాశీంపల్లి గ్రామంలో కందుల సురేష్‌కు తినే ఆహారంలో విష పదార్థం కలిసి తినిపించి మొహంపై బొంతతో అదిమి మరో వ్యక్తితో కలిసి భార్య హత్య చేసింది.

● కాటారం మండలకేంద్రంలో 2024 డిసెంబర్‌ 27న ఇప్పలగూడెంకు చెందిన డొంగిరి బుచ్చయ్యను భూవివాదంలో అదే గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు కర్రలతో కొట్టి చంపారు.

● మహదేవపూర్‌ మండలం చండ్రపల్లిలో 2024 నవంబర్‌ 27న రాత్రి మంచిర్యాల జిల్లాకు చెందిన ముత్యాల శ్రీకాంత్‌పై బైక్‌పై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కత్తులతో పొడిచి దారుణ హత్య చేశారు.

● తండ్రి వద్ద ఉన్న ఆస్తి రాసివ్వడం లేదని జిల్లాకేంద్రంలోని కారల్‌మార్క్స్‌కాలనీలో 2024 ఆగస్టు 12న బొమ్మన లక్ష్మారెడ్డిని భర్తతో కలిసి మరో నలుగురితో కూతురే తండ్రిని హత్య చేయించింది.

● 2024 ఏప్రిల్‌ 23న వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలానికి చెందిన గుగులోత్‌ ప్రభాకర్‌ను పర్వతగిరి మండలానికి చెందిన మరో ముగ్గురు వ్యక్తులు పెళ్లి సంబంధం విషయంలో భూపాలపల్లి మండలం గొల్లబుద్దారం తీసుకొచ్చారు. ఆటోలో తీసుకువచ్చి భూ వివాద కారణంతో రాంపూర్‌ అడవిలో హత్యచేసి పెట్రోల్‌ పోసి తగలపెట్టారు.

● 2024 డిసెంబర్‌ 5వ తేదీన మహదేవపూర్‌ మండలకేంద్రంలో భూవివాద కారణంతో సుంకె మహేష్‌పై అతని బంధువులే గొడ్డలితో దాడిచేసి తలపై తీవ్రంగా కొట్టి హత్యాయత్నానికి పాల్పడ్డారు.

● మహదేవపూర్‌ మండలం కాశీంపల్లిలో 2024 డిసెంబర్‌ 4న పెళ్లి బరాత్‌లో పాత కక్షలతో ఇరువర్గాలు గొడవ పడి అనంతరం ఇళ్లపైకి వెళ్లి ఒకరిని ఒకరు చంపుకునే ప్రయత్నం చేశారు.

● 2024 జూలై 20న జిల్లాకేంద్రంలోని గణేష్‌చౌక్‌లో నడిరోడ్డుపై గంజాయి మత్తులో నలుగురు యువకులు రెండు గ్రూపులుగా ఏర్పడి పరస్పర దాడికి పాల్పడగా గాయాలపాలయ్యారు.

జిల్లాలో చోటుచేసుకున్న ఘటనలు కొన్ని..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement