దరఖాస్తుల వివరాలు
● ఎస్సీ యువత స్వయం ఉపాధికి
సబ్సిడీ రుణాలు
● ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ
● జిల్లాకు 214 యూనిట్లు..
దరఖాస్తులు 1,824
● మండలాల్లో కొనసాగుతున్న
ఇంటర్వ్యూలు
● యూనిట్ల సంఖ్య పెంచాలంటున్న
నిరుద్యోగులు
జనగామ రూరల్: నిరుద్యోగులు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంతో 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ఎలక్ట్రిక్ టూ వీలర్, ఎలక్ట్రిక్ త్రీ వీలర్, సోలార్ పంప్ కంట్రోల్ సబ్సిడీ ద్వారా అందించేందుకు ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకం కింద దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాకు 214 యూనిట్లు రాగా లబ్ధిదారుల నుంచి 1,824 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 12 మండలాల్లో ఇప్పటికే మండలాల్లో దరఖాస్తుల పరిశీలనతో పాటు అభ్యర్థుల ఎంపికకు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ప్రక్రియ పూర్తయిన వారు ఆయా బ్యాంక్‌లకు వివరాలను అందజేస్తున్నారు. పథకానికి ఎంపికై న వారికి 70 శాతం నుంచి 100 శాతం సబ్సిడీ ద్వారా అందించనున్నారు. స్వయం ఉపాధితో ఆర్థికంగా నిలదొక్కుకోవాలనుకున్న వారికి మంచి అవకాశం. అయితే నిరుద్యోగుల ఆశలకు యూనిట్ల పరిమితి తక్కువ ఉండడంతో ఇబ్బందిగా మారింది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం దక్కే అవకాశం లేదు.
ఆశావాహుల ఎదురుచూపులు
స్వయం ఉపాధి పథకం కింద యూనిట్ వస్తే ఉపాధి పొందవచ్చని నిరుద్యోగులు భావిస్తున్నారు. అందుకే భారీ సంఖ్యలో దరఖాస్తులు రాగా ప్రస్తుతం యూనిట్ల సంఖ్య తక్కువగా ఉండటంతో ఎవరికీ అవకాశం వస్తుందోనని ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికలో కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఎలాంటి పైరవీలకు తావులేకుండా నిబంధనల ప్రకారం ప్రక్రియ పూర్తి చేయాలని అదేశాలు జారీ చేశారు. దరఖాస్తుల సంఖ్యకు అనుగుణంగా యూనిట్ల సంఖ్యను పెంచితే మరింత మంది నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.
నిరుద్యోగ ఎస్సీ యువతకు ఉపాధి కల్పించేందుకు సబ్సిడీ ద్వారా రుణాల అందజేయడం మంచి పరిణామమే. అయితే యూనిట్ల సంఖ్య తక్కువ ఉండడంతో తక్కువ మందికే లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వం స్పందించి యూనిట్ల సంఖ్య పెంచాలి. వందల రూపాయల ఖర్చు పెట్టుకోని ఆశతో యువత ఎదురుచూస్తున్నారు. వారి ఆర్థిక స్థితిగతులు పరిశీలించి అధికారులు న్యాయం చేయాలి.
–ఎలబోయిన హరీశ్, జిల్లా అధ్యక్షుడు, బీజేవైఎం
స్వయం ఉపాధి కల్పించేందుకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. బడ్జెట్ రాగానే ఎంపికై న లబ్ధిదారులకు యూనిట్లు అందిస్తాం. లబ్ధిదారుల ఎంపిక కోసం ఆయా ఎంపీడీఓలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఆయా మండలాలకు టార్గెట్లు ఇచ్చాం.
– మాధవీలత, ఈడీ,
ఎస్సీ కార్పొరేషన్
స్కీం పేరు యూనిట్స్ వచ్చిన
దరఖాస్తులు
ఈవీ టూవిల్లర్ 99 405
ఈవీ ట్రీవిల్లర్ 50 771
సోలార్ పంప్ కంట్రోల్ 11 50
పాడి పశువులు 54 606
మొత్తం 214 1832


