జనగామ రూరల్: శిల్పకళ, నిర్మాణరంగం, చేతివృత్తులు, సాంకేతిక నైపుణ్యాలకు విశ్వకర్మ భగవానుడి సేవలు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో భగవాన్ విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ చిత్రపటా నికి జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు వేశా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..విశ్వకర్మ భగవానుడు తన అపారమైన సృజనాత్మకత, అసమాన ప్రతిభతో సమాజ ప్రగతికి విశేషంగా దోహదపడ్డారని కొనియాడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్, జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ అధికారి ఎన్.ఎల్.నరసింహరావు, జిల్లా విశ్వబ్రాహ్మణ కుల సంఘం అధ్యక్షులు రామేశ్వరాచారి, ఉపాధ్యక్షుడు ఉప్పలయ్య చారి, విశ్వబ్రాహ్మణ కుల మహిళా సంఘం ఉపాధ్యక్షులు గంగాభవాని, పట్టణ వడ్రంగి సంఘం అధ్యక్షుడు సాంబయ్య చారి, విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం జిల్లా అధ్యక్షుడు దిగోజు నరసింహచారి తదితరులు పాల్గొన్నారు.
జీఓ 97ను రద్దు చేయాల్సిందే
స్టేషన్‌ఘన్‌పూర్: పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేలా ఉన్న జీఓ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఘన్‌పూర్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు డివిజన్ కేంద్రంలో గురువారం ర్యాలీ, మానవహారం, రాస్తారోకో చేపట్టారు. పాలిటెక్నిక్ కళాశాల నుంచి స్థానిక శివాజీ చౌక్ వరకు విద్యార్థులు పెద్దఎత్తున ర్యాలీ చేపట్టారు. అనంతరం శివాజీ చౌక్ వద్ద మానవహా రంతో పాటు రాస్తారోకో చేపట్టి రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎంకు వ్యతిరేకంగా నినదించారు. దాదాపు 20 నిమిషాల పాటు మానవహారం, రాస్తారోకో చేపట్టగా ట్రాఫిక్ స్తంభించింది. పాలిటెక్నిక్ విద్యార్థులకు జనసేన పార్టీ నాయకులు మద్దతు తెలుపుతూ నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు గాదె పృథ్వీ మాట్లాడుతూ.. జీఓ 97ను రద్దు చేసి పాలిటెక్నిక్ విద్యను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆమంచ సునీల్, ఎండీ.రజాక్, కొలిపాక వంశీకృష్ణ, ప్రశాంత్‌రెడ్డి, సాయి, బన్నీ, విక్రమ్‌కుమార్,నితిన్ తదితరులు పాల్గొన్నారు.
మిడ్ పరీక్షలను బహిష్కరించిన అఽధ్యాపకులు
జీఓ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని 59 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకుల బృందాలు తీసుకున్న నిర్ణయం మేరకు ఘన్‌పూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మిడ్ పరీక్షలను పూర్తిగా బహిష్కరిస్తున్నట్లు అధ్యాపకులు స్పష్టం చేశారు. జీఓ 97ను రద్దు చేసే వరకు మిడ్ పరీక్షల నిర్వహణకు సహకరించేది లేదని తేల్చిచెప్పారు.
భద్రకాళి ఆలయ ఆదాయం రూ.72 లక్షలు
హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయంలో గురువారం హుండీ లెక్కింపు నిర్వహించా రు. 76 రోజులకు రూ.72,30,387 ఆదాయం లభించిందని వరంగల్ దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈఓ రామల సునీత తెలిపారు. 628 యూఎస్‌ఏ డాలర్లు, 5 కెనడా డాలర్లు, 110 యూఏఈ దిరమ్స్, 10 బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ పౌండ్స్, 60 బ్యాంక్ ఆఫ్ అరేబియా మానిటరీ అథారిటీ, 10 యూరోలు లభించాయని తెలిపారు.


