జనగామ: పట్టణంలోని యశ్వంతాపూర్ బీఆర్‌ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో జాతీయ సమైఖ్యతా దినోత్సవం పురస్కరించుకుని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి జాతీయ జెండా, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పార్టీ పతాకావిష్కరణ చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.
డీసీసీ కార్యాలయంలో
ప్రజాపాలన వేడుకలు
జనగామ: జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో గురువారం ప్రజాపాలన వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య హాజరయ్యారు. డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి జాతీయ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైటీడీఏ సభ్యుడు డాక్టర్ లక్ష్మీనారాయణనాయక్, మున్సిపల్ చైర్‌పర్సన్ బాలమణిశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


