● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
నర్మెట (తరిగొప్పుల): ఎత్తైన ప్రాంతాలలోని ప్రతీ ఎకరాకు సాగునీరు అందించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. గండిరామారం పంప్‌హౌజ్ నుంచి తలపెట్టిన దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పేజ్–1 పనులను పార్టీ శ్రేణులతో కలసి శుక్రవారం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు.. తాను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కేసీఆర్ హయాంలోనే తరిగొప్పుల లిఫ్ట్ ఇరిగేషన్‌కు రూ.110 కోట్ల అంచనా వ్యయంతో మూడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభించారన్నారు. జూలై 15 లోగా ఎత్తైన ప్రాంతాలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటానని రైతులకు హామీ ఇచ్చారు. మల్లన్నగండి రిజర్వాయర్ ఆధారంగా రూ.63.80 కోట్లతో చేపట్టిన ఇరిగేషన్ పథకంతో తరిగొప్పుల మండలం సస్యశ్యామలం కానుందని ఆయన అన్నారు. ఆయన వెంట రాష్ట్ర నాయకులు గద్దల నర్సింగరావు, మండల శాఖ అధ్యక్షుడు పింగిళి జగన్మోహన్‌రెడ్డి, సర్పంచ్‌లు కంతి అంజనేయులు, శ్రీను, రవి నాయక్, మాజీ జెడ్పీటీసీ, ఎంపీటీసీలు ముద్దసాని పద్మజా వెంకట్‌రెడ్డి, భూక్య జుంలాల్, జిల్లా నాయకులు చిలువేరు లింగం, దామెర ప్రభుదాస్, అర్జుల రమా సంపత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉచిత వైద్యసేవలు అభినందనీయం
నర్మెట: మారుమూల ప్రాంతాల పేద ప్రజలకు ఉచిత వైద్యసేవలు అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. మచ్చుపహాడ్‌లో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోప్, హైదరాబాద్ వారు ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సర్పంచ్ లింగాల హైమ రమేశ్‌తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. డాక్టర్లు హేమానంద్, ఉత్తేజ్, హిమబిందు, సురేష్, ఉప సర్పంచ్ ఇనుగాల రాజిరెడ్డి, వార్డు సభ్యులు గుండేటి రాంచందర్, కుమారస్వామి, మాధవి, జయమ్మ, సంస్థ ప్రతినిథులు జయరాజ్, సామెల్, స్వామి, ఇమాన్యుయేల్, మారీ సంస్థ సభ్యులు ప్రేమలత పాల్గొన్నారు.


