ఆదు‘కొనండి’ సారూ! | - | Sakshi
Sakshi News home page

ఆదు‘కొనండి’ సారూ!

Apr 28 2026 7:59 AM | Updated on Apr 28 2026 7:59 AM

పాలకుర్తి టౌన్‌: తాము పండించిన ధాన్యం కొనాలి మహా ప్రభో అని రైతులు అధికారులను వేడుకుంటున్నారు. సోమవారం మండలంలోని ఈరవెన్ను గ్రామంలో రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి 20 రోజులు అవుతున్నా ఇంతవరకు ఒక్క బస్తా కూడా కొనుగోలు చేయలేదని వాపోయారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పలుకుప్పలుగా పేరుకపోయిందని వెంటనే కొనుగోలు చేయాలని కోరారు. వర్షం పడితే ధాన్యం మొత్తం దెబ్బతింటుందని, వెంటనే కొని ఆదుకోవాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement