పాలకుర్తి టౌన్: మండల కేంద్రంలోని శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయం గుట్ట భూమి సర్వే నెంబర్‌లో 542, 543లో అక్రమంగా ఇంటి నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆల య ఈఓ భాగం లక్ష్మీప్రసన్న హెచ్చరించారు. శని వారం శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయ భూమిలో అక్రమ ఇంటి నిర్మాణాలను దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది అడ్డుకొని కూల్చివేశారు. ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకట య్య, సిబ్బంది ముంజ రాములు, అమేడ రమేశ్, ఓం ప్రకాష్, నవీన్, అశోక్, నిరంజన్, సత్యనారా యణ,దేశబోయిన అంజనేయులు పాల్గొన్నారు.
ధర్మపురంలో..
దేవరుప్పుల: వల్మిడి పరిధి ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని సోమేశ్వర ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న హెచ్చరించారు. శనివారం మండలంలోని ధర్మపురంలో వల్మిడి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ భూమి సర్వే నంబర్ 449లో రాజన్న గుడిబండపై సంగీ రవి, రేణుక దంపతులు నిర్మిస్తున్న అక్రమ ఇంటి నిర్మాణ పనులను ఆలయ ధర్మకర్తలు, సిబ్బంది అడ్డుకున్నారు. రాజకీయ కక్షతో అడ్డుకుంటున్నారని వారు వాగ్వాదానికి దిగడంతో నిర్మాణ పనుల విషయమై నివేదిక ఇస్తామని సిబ్బంది తెలిపారు. కాగా ఈ విషయమై ఈఓ లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ.. ధర్మపురంలో సర్వే నెంబర్లు 395,396,397,398, 446,447,448,449 భూముల్లో వల్మిడి ఆలయ పరిధి సంబంధించి 34 ఎకరాల 34 గుంటల భూమి ఉందన్నారు. ఈ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే దేవాదాయ చట్టం 30/1987 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకట య్య, ఆలయ ధర్మకర్తలు పాలెపు సత్తయ్య, ముంజ రాములు, రమేశ్, ఓం ప్రకాష్ పాల్గొన్నారు.
సోమేశ్వర ఆలయ ఈఓ భాగం
లక్ష్మీప్రసన్న
పాలకుర్తి, ధర్మపురంలో
అక్రమ నిర్మాణాల అడ్డగింత


