‘సర్‌’ను పారదర్శకంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’ను పారదర్శకంగా నిర్వహించాలి

Apr 5 2026 8:30 AM | Updated on Apr 5 2026 8:30 AM

జనగామ: తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ఎలక్ట్రోరల్‌ అధికారి సి.సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌ నుంచి ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించగా, సమీకృత కలెక్టర్‌ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి కలెక్టర్‌, ఎన్నికల అధికారి సందీప్‌ కుమార్‌ ఝా ఆయా శాఖల ఉన్నతాధికారులతో కలిసి హాజరయ్యారు. రాష్ట్ర ఎలక్ట్రోరల్‌ అధికారి మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఎస్‌ఐఆర్‌పై అవగాహన కలిగి ఉండాలని, బీఎల్‌ఓలకు ఏ సందేహం ఉన్నా నివృత్తి చేయాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రాల మ్యాపింగ్‌ పనులను వేగంగా పూర్తి చేయాలని సూ చించారు. వీసీ అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న డెమోగ్రాఫిక్‌ సిమిలర్‌ ఎంట్రీలు, మ్యాపింగ్‌, ఫామ్‌ 6, 7, 8 దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమీక్షలో స్టేషన్‌ఘన్‌పూర్‌ ఆర్డీఓ వెంకన్న, ఎన్నికల సూపరింటెండెంట్‌ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

వీసీలో రాష్ట్ర ఎలక్ట్రోరల్‌ అధికారి

సుదర్శన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement