● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ రూరల్: తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య గొప్ప పోరాటయోధుడని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య జయంతి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూమి, భుక్తి, విముక్తి కోసం అనే నినాధంతో పోరాటం చేసి ప్రజల్లో స్ఫూర్తి నింపారని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు లక్ష్మీనర్సింహరావు, రవీందర్, డి.మల్లికాంబ, జె.మల్లేష్, కె.రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


