లింగాలఘణపురం: మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో అసంపూర్తిగా ఉన్న బాలికల హాస్టల్ భవనం పనులు ఎట్టకేలకు పునఃప్రారంభమయ్యాయి. జిల్లాలో ఏౖకైక మోడల్ స్కూల్ హాస్టల్ భవనం సుమారు 12 ఏళ్లుగా అసంపూర్తిగా ఉంది. దీంతో అనేకసార్లు అనేక గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులకు విన్నవించిన నేపథ్యంలో ఇటీవల రూ.1.44 కోట్లతో టెండర్లు నిర్వహించారు. దీంతో ఓ కాంట్రాక్టర్ పనులు దక్కించుకొని పనులు మొదలుపెట్టారు. అసంపూర్తి భవనం చుట్టూ ఉన్న చెట్లను తొలగించి పనులు ప్రారంభించారు. ఈ హాస్టల్ భవనం పూర్తయితే వంద మంది పేద బాలికలకు హాస్టల్ సౌకర్యం కల్పించడబడుతుంది. త్వరగా పూర్తిస్థాయిలో పనులు చేపట్టి వేసవిలో పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరం భవనం అందుబాటులోనికి తేవాలని మండలంలోని విద్యార్థినుల తల్లిదండ్రులు, గ్రామస్తులు కోరుతున్నారు.
● రూ.1.44 కోట్లతో పనులు పునఃప్రారంభం


