● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ రూరల్: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మంగళవారం మండలంలోని అడవికేశ్వాపూర్ గ్రామ పరిధిలో గల ప్రాథమిక పాఠశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్య, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం అమలు వంటి అంశాలను పర్యవేక్షించారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందించాలని, నాణ్యతగా ఉండాలన్నారు. విద్యార్థులతో మాట్లాడి పాఠ్యాంశాలపై అవగాహన గురించి పలు ప్రశ్నలు వేసి పరిశీలించారు. అలాగే గ్రామ పంచాయతీలో గల అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. నిర్వహించారు. చిన్నారుల ఆరోగ్యానికి పోషకాహారం ఎంతో ముఖ్యమని సిబ్బంది బాధ్యతగా పనిచేయాలన్నారు. అనంతరం వడ్లకొండ రోడ్డులోని సఖి కేంద్రాన్ని తనిఖీ చేశారు.
చదువుతోపాటు సామాజిక అవగాహన ఉండాలి
● ట్రెయినీ ఐపీఎస్ మనీషానెహ్ర
స్టేషన్‌ఘన్‌పూర్: విద్యార్థులు చదువుతో పాటు సామాజిక అవగాహన కల్గి ఉండాలని ట్రెయినీ ఐపీఎస్ మనీషానెహ్ర సూచించారు. ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలోని సెయింట్ థామస్ హైస్కూల్‌లో విద్యార్థులకు ట్రాఫిక్ ఎడ్యుకేషన్‌పై పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ కేసీ జాన్‌బన్నీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ట్రెయినీ ఐపీఎస్ మాట్లాడారు.. విద్యార్ధి దశలోనే భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. దీనికి ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ట్రాఫిక్ ఎడ్యుకేషన్ పై విద్యార్థులు వేసిన పెయింటింగ్‌లు బాగున్నాయని అభినందించారు. కార్యక్రమంలో సీఐ జి.వేణు, ఎస్‌ఐ రాజేష్, ఉపాధ్యాయులు,
విద్యార్థులు పాల్గొన్నారు.


