అథ్లెటిక్స్‌ పోటీల క్యాలెండర్‌ సిద్ధం | - | Sakshi
Sakshi News home page

అథ్లెటిక్స్‌ పోటీల క్యాలెండర్‌ సిద్ధం

Mar 30 2026 8:40 AM | Updated on Mar 30 2026 8:40 AM

టీ అథ్లెటిక్స్‌ సంఘం కార్యదర్శి సారంగపాణి

వరంగల్‌ స్పోర్ట్స్‌ : తెలంగాణలో 2026–27 సంవత్సరంలో నిర్వహించనున్న రాష్ట్ర, జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌ పోటీల క్యాలెండర్‌ను రూపొందించినట్లు తెలంగాణ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి కె సారంగపాణి పేర్కొన్నారు. హనుమకొండలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు స్టాన్లీజోన్స్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి సారంగపాణి మాట్లాడుతూ..ప్రతిభ గల అథ్లెట్లను గుర్తించి వారికి మెరుగైన శిక్షణ అందించేందుకు తమ అసోసియేషన్‌ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతుందన్నారు. సమావేశంలో అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు మహిపాల్‌, మహిధర్‌, రత్నాకర్‌, నిర్వహణ కార్యదర్శి పగడాల వెంకటేశ్వర్‌రెడ్డి, వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు కిషన్‌, చైర్మన్‌ గట్టు మహేష్‌బాబు, చీఫ్‌ కోచ్‌ ఎండీ గౌస్‌, సభ్యులు మనోజ్‌, సోమశేఖర్‌, ఆయా జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

రామప్పలో ఆస్ట్రియా దేశస్తుడు

వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఆదివారం ఆస్ట్రియాకు చెందిన హరల్డ్‌ సీబాచర్‌ సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని ఆయన దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్‌ విజయ్‌కుమార్‌ వివరించగా రామప్ప శిల్పకళ సంపద అద్భుతంగా ఉందని కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement