మక్కల కొనుగోలు కేంద్రం సందర్శన | - | Sakshi
Sakshi News home page

మక్కల కొనుగోలు కేంద్రం సందర్శన

Mar 29 2026 7:21 AM | Updated on Mar 29 2026 7:21 AM

స్టేషన్‌ఘన్‌పూర్‌: ఘన్‌పూర్‌ వ్యవసాయ మార్కెట్‌లో మక్కలు అమ్ముకునేందుకు వచ్చిన రైతులు పడుతున్న ఇబ్బందులు, తేమ, ఫంగస్‌ సాకుతో నిర్వాహకులు పెడుతున్న కొర్రీలపై ‘అమ్మబోతే కొర్రీ’ అనే శీర్షికన ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన కథనానికి మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ రంజిత్‌రెడ్డి స్పందించారు. ఏఎంసీ చైర్‌పర్సన్‌ జూలుకుంట్ల లావణ్యశిరీష్‌రెడ్డితో కలిసి మక్కల కొనుగో లు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సెంటర్‌లో రాశులుగా ఉన్న మక్కలను పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడు తూ నిబంధనల మేరకు తేమశాతం తప్పనిసరిగా ఉండాలన్నా రు. అనంతరం మక్కల కొనుగోళ్లను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్‌పర్సన్‌ జూలుకుంట్ల లావణ్య, మార్కెట్‌ సెక్రటరీ జన్ను భాస్కర్‌, కాంగ్రెస్‌ మండల పార్టీ అఽ ద్యక్షుడు జూలుకుంట్ల శిరీష్‌రెడ్డి, సెంటర్‌ నిర్వాహకుడు ఐత సంతోష్‌, రైతులు పాల్గొన్నారు.

ఏఎంసీ కార్యదర్శిగా అంజిత్‌రావు

జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్‌ ప్రత్యేక గ్రేడ్‌ కార్యదర్శిగా డి.అంజిత్‌రావును నియమిస్తూ వ్యవసాయ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ కె.సురేంద్ర మోహన్‌ (ఐఏఎస్‌) శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వరంగల్‌ ఏఎంసీ గ్రేడ్‌–2 కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయనకు జనగామలో పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే ఖమ్మం డీఎంఓ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న కె.రామకృష్ణకు తాత్కాలిక బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement