● డీసీపీ రాజమహేంద్రనాయక్
బచ్చన్నపేట: ద్విచక్ర వాహనదారులు ప్రయాణ సమయంలో హెల్మెట్‌ను తప్పకుండా ధరించాలని డీసీపీ రాజమహేంద్రనాయ క్, ఏఎస్పీ పండేరి నితిన్‌చేతన్‌లు అన్నారు. శనివారం రోడ్డు భద్రతా మా సోత్సవాల సందర్భంగా మండలకేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహ ప్రాంగణంలో సర్పంచ్ అల్వాల నర్సింగరావు అధ్యక్షతన వాహనదారులకు అవగాహన సదస్సు నిర్వహించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరి ధరించాలని, కార్లలో ప్రయాణం చేసే సమయంలో విధిగా సీటు బెల్టు ధరించాలన్నా రు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులకు శిక్ష పడుతుందన్నారు. అనంతరం 100 మందికి హెల్మెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీఐ అబ్బయ్య, ఎస్సై ఎస్‌కే అబ్దుల్ హమీద్, ఎ స్సై నైనాల నరేష్, బాలకిషన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


