ఆలయాభివృద్ధికి రూ.2 లక్షల విరాళం | - | Sakshi
Sakshi News home page

ఆలయాభివృద్ధికి రూ.2 లక్షల విరాళం

Mar 28 2026 7:46 AM | Updated on Mar 28 2026 7:46 AM

రఘునాథపల్లి: మండలంలోని శ్రీమన్నారాయణపురం గ్రామంలోని శ్రీమన్నారాయణమూర్తి ఆలయ పునఃనిర్మాణానికి వంశీ ఫౌండేషన్‌ చైర్మన్‌ కంచరకుంట్ల వంశీరెడ్డి శుక్రవారం రూ.2 లక్షల విరాళం అందజేశారు. గ్రామంలో జరిగిన శ్రీరామ నవమి వేడుకల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మారుజోడు రాంబాబు, సర్పంచ్‌ తూడి వెంకటేష్‌తో కలిసి పాల్గొని రూ.2 లక్షల చెక్కు అందజేశారు. ఆలయ పునః నిర్మాణానికి నిధులు సమకూర్చిన వంశీరెడ్డిని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌, సర్పంచ్‌తో పాటు గ్రామస్తులు అభినందించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ గజ్జెల నాగేష్‌, కొమురాజి,వేణుమాధవ్‌, భిక్షపతి, యాదగిరి, అంజయ్య, మల్లయ్య, వీరస్వామి, జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.

అదుపుతప్పి..

దాణా లారీ బోల్తా

జనగామ రూరల్‌: జనగామ–సిద్దిపేట రహదారి శామీర్‌పేట క్రాస్‌ రోడ్డు వద్ద శుక్రవారం ఓ దాణా లారీ బోల్తా పడి డ్రైవర్‌కు గాయాలయ్యాయి. షోలాపూర్‌ నుంచి ఏపీలోని రాజ మండ్రికి సోయాబిన్‌ పౌడర్‌ లోడ్‌తో వెళ్తున్న లారీ శామీర్‌పేట క్రాస్‌ వద్ద అదుపుతప్పి బో ల్తాపడింది. డ్రైవర్‌కు గాయాలు కాగా జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. లారీలో రూ.5 లక్షలకు పైగా విలువ చేసే సరుకు ఉంది. నిత్యం ప్రమాదాలతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే హైవే అధికారులు పట్టించుకోవాలని, ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు. లారీ బోల్తా పడిన ప్రదేశాన్ని వారు పరిశీలించారు. మండల కార్యదర్శి బోడ నరేందర్‌, తాండ్ర ఆనందం, మల్లేష్‌, యాదగిరి, ప్రసాద్‌ తదితరులు ఉన్నారు.

176 స్లాట్లు..

8:30 వరకు రిజిస్ట్రేషన్లు

కాజీపేట అర్బన్‌: కాజీపేట వంద ఫీట్ల రోడ్డులోని వరంగల్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో శనివారం 176 స్లాట్‌ రిజిస్ట్రేషన్లను రాత్రి 8.30 నిమిషాల వరకు సబ్‌ రిజిస్ట్రార్లు పూర్తి చేయనున్నారు. రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న తరుణంలో శనివారం, సోమవారం, మంగళవారం మూడురోజుల పాటు రిజిస్ట్రేషన్‌ శాఖ ఆదాయాన్ని పెంచేందుకు సబ్‌ రిజిస్ట్రార్ల పని వేళలు మారుస్తూ 11 గంటల పాటు రిజిస్ట్రేషన్లు కొనసాగేలా మార్పు చేసింది. ఇందులో భాగంగా.. సాధారణంగా ఉదయం 10.30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల పని వేళలను మారుస్తూ ఉదయం 9:30 నిమిషాల నుంచి రాత్రి 8.30 నిమిషాల వరకు నిర్ణయించింది. పస్తుతం మార్చిన స్లాట్స్‌లో భాగంగా 176 స్లాట్లకు అవకాశం కల్పించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఇదే తరహాగా పని వేళలు, స్లాట్‌ బుకింగ్‌లు కొనసాగనున్నాయి.

27హెచ్‌ఎమ్‌కెడి 306 –

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement