మెరుగైన వైద్యం అందించాలి | - | Sakshi
Sakshi News home page

మెరుగైన వైద్యం అందించాలి

Mar 28 2026 7:46 AM | Updated on Mar 28 2026 7:46 AM

బాలికల గురుకుల పాఠశాలలో..

పాలకుర్తి టౌన్‌: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రతీ వైద్యుడి బాధ్యత అని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా స్పష్టం చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని మందుల గది, ల్యాబ్‌, ఇన్‌పేషెంట్‌ విభాగం, స్టాక్‌ రిజిస్టర్‌, సిబ్బంది హాజరు రిజిష్టర్‌ను పరిశీలించారు. గ్యాస్‌ కొరతతో ఆసుపత్రికి వచ్చే రోగులకు అందించే భోజనం కట్టెల పొ య్యిపై చేయడాన్ని చూసిన కలెక్టర్‌ వెంటనే గ్యాస్‌ సిలిండర్లను సరఫరా చేయాలని ఆధికారులను అదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. రోగులకు మెరుగైన చికిత్స అందించాలని, నిర్లక్ష్యం అసలు సహించబోమని హెచ్చరించారు. చికిత్స పొందుతున్న రోగులతో కలెక్టర్‌ ఆప్యాయంగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు ప్రజలకు నమ్మకమైన సేవా కేంద్రాలుగా నిలవాలని సూచించారు. కలెక్టర్‌ వెంట డాక్టర్‌ శ్వేత, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రులు నమ్మకమైన సేవా కేంద్రాలుగా నిలవాలి

కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

పాలకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి,

గురుకులంలో తనిఖీ

మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలోని వంటశాల, భోజనశాలను పరిశీలించారు. బియ్యం, పప్పులు, ఉల్లిగడ్డలు తదితర సరుకుల నాణ్యతను కలెక్టర్‌ స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు పోషకాహారం రుచిగా, సమయానికి అందించాలని సూచించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి పరీక్షలకు సన్నద్ధతపై ఆరా తీశారు. పాఠశాల ప్రిన్సిపాల్‌ స్వరూప, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement