మండుటెండల్లో చల్లటి ఉపశమనం | - | Sakshi
Sakshi News home page

మండుటెండల్లో చల్లటి ఉపశమనం

Mar 28 2026 7:46 AM | Updated on Mar 28 2026 7:46 AM

జనగామ: వేసవిలో దంచికొడుతున్న ఎండలు.. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ప్రజల ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. తీవ్రమైన వేడిలో ఉపశమనం కోసం ప్రజలు పుచ్చకాయలను కొనుగోలు చేస్తుండడంతో వాటికి డిమాండ్‌ పెరిగింది. జిల్లా కేంద్రంలోని పాతబీటు బజారు, హైదరాబాద్‌ రోడ్‌, ప్రధాన కూడళ్లలో పుచ్చ పండ్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.

డీ హైడ్రేషన్‌ దూరం..

ఒక్కో పుచ్చకాయ రూ.30 నుంచి రూ.40 వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ ప్రభావం పెరిగే కొద్దీ పుచ్చకాయల కొనుగోలు కూడా పెరుగుతోంది. వేడిలో దాహార్తిని తగ్గించడం, శరీరానికి తక్షణ శక్తినివ్వడంలో పుచ్చకాయలకు మించింది లేదు. తక్కువ ధర, ఎక్కువ నీటి శాతం కలిగి ఉండడంతో ప్రజలు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. వేసవిలో పుచ్చకాయలు సహజంగా డీహైడ్రేషన్‌ తగ్గిస్తాయి. ఇందులో ఉండే ఎలక్ట్రోలైట్స్‌, విటమిన్‌ ఏ, సీ, యాంటీ ఆక్సిడెంట్స్‌ శరీరాన్ని చ ల్లబరచడంతో పాటు డీహైడ్రేషన్‌ తగ్గిస్తాయి. పుచ్చకాయల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని తోటల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నా రు. పుచ్చకాయల విక్రయం ద్వారా వేసవిలో రైతులు, అమ్మకం దారులకు మంచి ఉపాధి లభిస్తోంది.

పుచ్చకాయలకు ఫుల్‌ గిరాకీ

డీహైడ్రేషన్‌ తగ్గించే సహజ ఫలం

రైతులు, అమ్మకం దారులకు ఉపాధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement