మురుగు నీరు రిజర్వాయర్‌లోకి రావొద్దు | - | Sakshi
Sakshi News home page

మురుగు నీరు రిజర్వాయర్‌లోకి రావొద్దు

Mar 28 2026 7:46 AM | Updated on Mar 28 2026 7:46 AM

లింగాలఘణపురం: రిజర్వాయర్‌లోకి మురుగు నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా కాలువలను ఎక్కడపడితే అక్కడ తొలగించి నిబంధనలకు విరుద్ధంగా సాగునీటిని వాడుకోవద్దని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి వీఎల్‌ కాంతారావు అన్నారు. శుక్రవారం ఆయన జిల్లాలో పర్యటించిన సందర్భంగా మండలంలోని నవాబు పేట రిజర్వాయర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్‌ సదానందం, పలువురు రైతులు మాట్లాడుతూ.. జనగామ పట్టణంలోని మురికి నీరంతా నెల్లుట్ల చెరువులోకి చేరుతోందని, అక్కడి నుంచి రిజర్వాయర్‌లోకి వదులుతున్నారని ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో వెంటనే ఆయన స్పందించి మురికి నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు సూచించారు. రిజర్వాయర్‌లతో సాగు విస్తీర్ణం ఎలా పెరిగింది..ప్రయోజనం పొందుతున్నారా..? అంటూ అడిగి తెలుసుకున్నారు. తూము వద్ద ధ్వంసమైన కాలువ మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. ఆయనతో పాటు కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, ఈఎన్‌సీ రమేశ్‌ బాబు, ఎస్‌ఈ సీతారాం, వరంగల్‌ సీఈ సుధీర్‌, ఆర్డీఓ వెంకన్న, తహసీల్దార్‌ అండాలు, నీటిపారుదల శాఖ అధికారులు ఉన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా నీటిని వాడొద్దు

కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి వీఎల్‌ కాంతారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement