కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
స్టేషన్‌ఘన్‌పూర్: పదోతరగతి వార్షిక పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పరీక్షలను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు. ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని స్టేషన్‌ఘన్‌పూర్, చాగల్లు జెడ్పీఎస్‌ఎస్‌లో నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రాలను శనివారం కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా సెంటర్లలో పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. పరీక్షల నిర్వహణ ఎలా ఉందని, ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారని,తదితర వివరాలను సంబంధిత అఽధికారులను అడిగి తెలుసుకున్నారు. పరీక్ష పూర్తయిన వెంటనే జవాబు పత్రాలను పోలీసు బందోబస్తు మధ్య నిర్దేశిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.


