నాణ్యమైన విద్యుత్‌ అందించడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్యుత్‌ అందించడమే లక్ష్యం

Mar 30 2026 8:40 AM | Updated on Mar 30 2026 8:40 AM

ఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ సంపత్‌రెడ్డి

స్టేషన్‌ఘన్‌పూర్‌ : ప్రజలకు నిరంతరంగా నాణ్యమై న విద్యుత్‌ను అందించడమే లక్ష్యంగా విద్యుత్‌శా ఖ పనిచేస్తుందని ఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ సంపత్‌రెడ్డి అన్నారు. డివిజన్‌పరిధిలోని ఘన్‌పూర్‌ టౌన్‌ సెక్షన్‌లో ఉన్న మీదికొండ 33/11 కేవీ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన అదనపు 5 ఎంవీఏ పవన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ పీటీఆర్‌ను ఎస్‌ఈ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ సరఫరా వ్యవస్థను మరింత పటిష్టంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అమలు చేస్తున్న వేసవి వేసవి యాక్షన్‌ ప్లాన్‌ కింద మీదికొండ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో అదనపు 5 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ పీటీఆర్‌ను విజయవంతంగా ఛార్జ్‌ చేసినట్లు తెలిపా రు. కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ చార్జింగ్‌ వల్ల లోడ్‌ పంపిణీ మెరుగుపడుతుందని, వేసవిలోనూ నిర్విఘ్నంగా నిరంతర విద్యుత్‌ సరఫరా సాధ్యమవుతుందన్నారు. వినియోగదారులు విద్యుత్‌ పరమైన సమస్యల కోసం సమీపంలోని విద్యుత్‌శాఖ కార్యాలయంలో సంప్రదించవచ్చన్నారు. టోల్‌ఫ్రీ నంబర్‌ 1912కు ఫోన్‌ చేయవచ్చని ఆయన సూచించారు. కార్యక్రమంలో డీఈ సారయ్య, ఏడీఈ రణధీర్‌రెడ్డి, ఏఈలు పి.శంకర్‌, కుమారస్వామి, ఫోర్‌మన్‌ రామాచారి, లైన్‌మన్‌ అల్లం సదన్‌, కాంట్రాక్టర్‌ అమరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement