కాజీపేట అర్బన్: పరిశ్రమలకు నూతన ఆవిష్కరణలు, ఆలోచనలను అందజేసేందుకు ఇంక్యుబేషన్‌లా నిట్ వరంగల్ నిలుస్తుందని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. నిట్ వరంగల్‌లోని అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో శుక్రవారం ఐఏఐసీ–26 (ఇండస్ట్రీ అకాడమీ ఇన్నోవేషన్ కాన్‌క్లేవ్) రీసెర్చ్ అండ్ ఇండస్ట్రీయల్ కన్సల్టెన్సీ, సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సౌజన్యంతో నిర్వహించారు. ఐఏఐసీ–26 సమావేశానికి ముఖ్య అతిథిగా నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించి మాట్లాడుతూ నిట్ వరంగల్ ఇన్నోవేషన్ సెంటర్ వేదికగా నిలుస్తోందన్నారు. కాగా, ఐఏఐసీ–26 సమావేశంలో టెక్నాలజీ స్టాల్స్, ఇన్నోవేషన్, ఏఐ ఎగ్జిబిట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో ఫిలిప్స్ టౌన్సెండ్ అసోసియేషన్, ఎల్‌అండ్‌టీ అడ్వైజర్ వినాయక్ మరాఠే, ఎఎన్‌ఆర్‌ఎఫ్ సీఈఓ శివకుమార్, ఐఏఐసీ ప్రతినిధులు, నిట్ ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు.
నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ
ఐఏఐసీ–26 సమావేశం ప్రారంభం


