● ఘనంగా ప్రపంచ రంగస్థల దినోత్సవం
హన్మకొండ కల్చరల్: ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకతీయ నాటక కళాపరిషత్ వరంగల్ వారి ఆధ్వర్యంలో అభినవ ఆంజనేయ బిరుదాంకితులు జమ్మలమడక కృష్ణమూర్తి స్మారకంగా నిర్వహించిన సమ్మక్క–సారలమ్మ పద్యనాటక ప్రదర్శన అలరించింది. ఈమేరకు శుక్రవారం పోతన పీఠంలో జరిగిన ప్రపంచ రంగస్థల దినోత్సవ వేడుకలను యూత్‌కాంగ్రెస్ నాయకులు విష్ణురెడ్డి, వరంగల్ జిల్లా బీజేపీ నాయకులు గంటా రవికుమార్, సీనియర్ కళాకారులు తడకమల్ల రామచంద్రరావు, ఆకుల సదానందం, జేఎన్ శర్మ, నెరేళ్ల శోభావతి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా ప్రదర్శించిన సమ్మక్క సారలమ్మ పద్యనాటకం ప్రేక్షకులను అలరించింది. అనంతరం యోగా సాధకులు మినుపూరి సంధ్య, రాణి పాల్గొన్నారు.


