రోడ్డు భద్రతపై అవగాహన ఉండాలి.. | - | Sakshi
Sakshi News home page

రోడ్డు భద్రతపై అవగాహన ఉండాలి..

Mar 27 2026 9:14 AM | Updated on Mar 27 2026 9:14 AM

లింగాలఘణపురం: రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండి ప్రయాణించాలని డీసీపీ రాజమహేంద్రనాయక్‌ సూచించారు. గురువారం మండలంలోని వడిచర్లలో రోడ్డు భద్రతలో మూడో విడత కార్యక్రమంలో భాగంగా ఎస్సై శ్రావణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో దాతల సహాయంతో వందకు పైగా హెల్మెట్‌లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీసీపీ ముఖ్యఅతిథిగా పాల్గొని హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలని, మైనర్‌లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వవద్దన్నారు. అంతకు ముందు గ్రామంలో హెల్మెట్‌లు ధరించిన వాహనదారులతో భారీ ర్యాలీ తీశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కార్తీక్‌, వార్డు సభ్యులు, దాతలు పాల్గొన్నారు.

ప్రతీ ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

స్టేషన్‌ఘన్‌పూర్‌: ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు పాటుపడాలని ట్రెయినీ ఐపీఎస్‌ మనీషా నెహ్ర అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఛాగల్లులో జాతీయ రహదారి పక్కన రోడ్డు ప్రమాదాల నివారణకు స్టేషన్‌ఘన్‌పూర్‌ పోలీసుశాఖ వారిచే హెచ్చరిక సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సీఐ జి.వేణు, ఎస్‌ఐ రాజేష్‌, కౌన్సిలర్లు పొన్న రాజేష్‌, బాలగాని అనీల్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

డీసీపీ రాజమహేంద్రనాయక్‌

ఉచితంగా హెల్మెట్‌ల పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement