జనగామ: ధర్తీ అభ జెన్ జాతీయ గ్రామీణ ఉత్కర్ష అభియాన్ (డీఏజేజీఏయూఏ) పథకం క్రింద జిల్లాలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి వేగవంతమవుతోందని ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ సంపత్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లాలోని బోజ్యతండా గ్రామపంచాయతీ పరిధిలోని పంచరాయి తండా పాఠశాల ఏరియాలో సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసి, పాఠశాలకు ఉచిత విద్యుత్ మీట ర్‌ను అమర్చారు. డీఏ జేజీఏయూఏ పథకం ద్వారా జిల్లాలోని ఎస్టీ తండాల్లోని 800 కుటుంబాలకు ఉచిత విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 366 అంగన్‌వాడీ సెంటర్లకు గాను 50 కేంద్రాలకు ఇప్పటికే ఉచిత కనెక్షన్లు అందించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సుగుణభీమా, ఉపసర్పంచ్ కొముర, పాఠశాల చైర్మన్ రుక్కమ్మ, ప్రధానోపాధ్యాయురాలు సుమిత్ర, ఉపాధ్యాయుడు రాజేందర్, మాజీ ఎంపీటీసీ జుమీలాల్, వార్డ్‌మెంబర్లు, గ్రామస్థులతో పాటు విద్యుత్ శాఖ అధికారులు డివిజనల్ ఇంజనీర్ (టెక్నికల్) గడ్డం గణేష్, డివిజనల్ ఇంజనీర్ విజయ్ కుమార్, ఏడీఈ ఆకిటి స్వామిరెడ్డి, ఏడీఈ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


