కేయూ క్యాంపస్ : కేయూలో సైన్స్ విభాగాల్లో 2026–2027 జనవరి సెషన్‌లో పీహెచ్‌డీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీచేసినట్లు సైన్స్ విభాగాల డీన్ జి. హనుమంతు గురువారం తెలిపారు. ఫెల్లోషిప్ అభ్యర్థులు యూజీసీ జేఆర్‌ఎఫ్, /సీఎస్‌ఐఆర్/ సీడ్/డీఈటీ/ ఎన్‌ఎఫ్‌పీడబ్ల్యూ డీ, డీఎస్‌టీ–ఇన్‌స్పైర్ లేదా ఫిప్, క్విప్ టీచర్ ఫెల్లోషిప్స్, అలాగే నెట్, గేట్, జిప్యాట్ కలిగిన అభ్యర్థులు ఈ పీహెచ్‌డీలో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఏప్రిల్ 10వ తేదీ వరకు సైన్స్‌విభాగాల డీన్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాల్సింటుంది. వెకెన్సీలు ఇలా ఉన్నాయి. బయోకెమిస్ట్రీ 3, బ యోటెక్నాలజీ 4, బాటనీ 4, కెమిస్ట్రీ 4, కంప్యూటర్ సైన్స్ 5, జియాలజీ 1, మ్యాథ్‌మెటిక్స్ 9, మైక్రోబయాలజీ 6, ఫిజిక్స్ 6, జువాలజీ 13 సీట్లు వెకెన్సీలుగా ఉన్నాయని తెలిపారు.
రేపటి నుంచి క్రీస్తుజ్యోతిలో టెక్నోజిల్
జనగామ: మండలం యశ్వంతాపూర్ క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 28వ తేదీ నుంచి టెక్నోజిల్–2026 వేడుకలు నిర్వహించనున్నట్లు క ళాశాల డైరెక్టర్ డి.విజయపాల్‌రెడ్డి తెలిపారు. గురువారం టెక్నోజిల్ పోస్టర్‌ను ఆవిష్కరించిన అనంత రం ఆయన మాట్లాడారు.. నాలుగు రోజులు పాటు జరిగే టెక్నోజిల్ వేడుకల్లో సాంకేతిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. ప్రిన్సిపాల్ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. చివరి రోజు 30వ తేదీ నిర్వహించే మెగా ఈవెంట్ లైవ్ మ్యూజిక్, ఫ్యాషన్ షో, ఇతర కళాశాలల ఆధ్వర్యంలో సాంస్కృతిక కా ర్యక్రమాలు ఉంటాయన్నారు. ఇందులో కార్యక్రమ కన్వీనర్ అనిత, కో కన్వీ నర్ అమరేందర్, వంశీక్రిష్ణ తదితరులు ఉన్నారు.


