వేసవిలో జాగ్రత్తలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

వేసవిలో జాగ్రత్తలు పాటించాలి

Mar 27 2026 9:13 AM | Updated on Mar 27 2026 9:13 AM

జనగామ రూరల్‌: వేసవి నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా తెలిపారు. గురువారం మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా స్థాయి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. వడదెబ్బకు ఎలాంటి నష్టాలు కలగకుండా శాఖల వారీగా వారి పరిధిలో తీసుకోనున్న యాక్షన్‌ ప్లాన్‌ అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ..విద్యార్థులకు, గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు, వడదెబ్బకు సంబంధించిన మందులను పంపిణీ చేయాలన్నారు. చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్ల అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో కలిసి వాల్‌పోస్టర్‌ ఆవిష్కరించారు. సమావేశంలో డీసీపీ రాజమహేంద్రనాయక్‌, అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌, ఏసీపీ పండరి చేతన్‌, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి మలికార్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

‘సర్‌’ ప్రక్రియకు సహకారం అందించాలి..

స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(సర్‌) మ్యాపింగ్‌ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారం అందించాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా తెలిపారు. మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

సమర్థవంతంగా డిజిటల్‌ పాలన..

జిల్లాలో డిజిటల్‌ పాలనను మరింత సమర్థమంతంగా అమలు చేసేందుకు గాను జిల్లా స్థాయి ఐటీ మానిటరింగ్‌ సెల్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా పేర్కొన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలోని ఎన్‌ఐసీ హాల్లో జిల్లా స్థాయి ఐటీ మానిటరింగ్‌ సెల్‌ను అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌తో కలిసి ప్రారంభించారు. ప్రధానంగా గ్యాస్‌ సరఫరా, ఇసుక తరలింపు, తాగునీటి సమస్యలపై వెంటనే స్పందించేందుకు టోల్‌ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. సమస్యల పరిష్కారం కోసం 1800 425 6605 టోల్‌ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ ఫణి కుమార్‌, ఈడీఎం గౌతమ్‌, ఇతర సంబంధిత అధికారులు, ఐటీ సిబ్బంది పాల్గొన్నారు.

మహిళలు ఆర్థికంగా బలపడాలి..

మహిళలు వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతను వినియోగించుకోని ఆర్థికంగా బలపడాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు. మండలంలోని మరిగడి గ్రామంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలు లో మహిళలకు డ్రోన్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అడిషనల్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ నూరుద్దీన్‌, జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని, డీపీఎం నలిని, నారాయణ, వ్యవసాయ అధికారులు శరత్‌ చంద్ర, విజయ రెడ్డి, మనోహిత్‌, వ్యవసాయ విస్తరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

వైద్యులు అందుబాటులో ఉండాలి

బచ్చన్నపేట: వైద్యులు అందుబాటులో ఉంటూ రోగులకు మనో ధైర్యం కల్పించాలని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీల సంఖ్యను పెంచాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ ఆకస్మికంగా సందర్శించి, తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బంది రిజిస్టర్‌, ఓపి రిజిస్టర్‌, పిల్లల వార్డు, ఇన్‌ పెషేంట్‌ వార్డులను, మందుల నిల్వలను పరిశీలించారు. అనంతరం మన్‌సాన్‌పల్లి, లింగంపల్లి, కొన్నె, రామచంద్రాపురం, ఇటికాలపల్లి గ్రామాల్లో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ నేపథ్యంలో వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి, నాణ్యతాప్రమాణాలను తప్పకుండా పాటించాలని అధికారులకు సూచించారు. కొన్నె గ్రామంలో అక్రమంగా నడుస్తున్న హిటాచీని సీజ్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో హౌసింగ్‌ పీడీ మాతృనాయక్‌, సర్పంచ్‌లు కోడూరి స్వర్ణలత, గీస సందీప్‌, అల్వాల నర్సింగారావు , వైద్యులు, అంగన్వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement