శ్రీసోమేశ్వరుడి హుండీ ఆదాయం
లక్షలు
రూ.
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయం హుండీ ఆదాయం రూ.15,32,767 సమకూరినట్లు ఈఓ భాగం లక్ష్మీప్రసన్న తెలిపారు. 2026 జనవరి 2 నుంచి మార్చి 24 వరకు భక్తులు హుండీలో సమర్పించిన 80 రోజుల కానుకల ఆదాయాన్ని మంగళవారం ఆలయ కల్యాణ మండపంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ భువనగిరి ఇన్‌స్పెక్టర్ నిఖిల్ పర్యవేక్షణలో లెక్కించారు. 2 గ్రాముల 111మిల్లీ గ్రాముల మిశ్రమ బంగారం, 500 గ్రాముల మిశ్రమ వెండి, యూఎస్ డాలర్–1, ఇంగ్లాండ్ –1(10ఫౌండ్స్) వచ్చినట్లు తెలిపారు. హుండీ లెక్కింపులో సర్పంచ్ కమ్మగాని విజయ, ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, ప్రధాన అర్చకుడు దేవగిరి లక్ష్మన్న, డీవీఆర్‌శర్మ, దేవగిరి అనిల్‌కుమార్, ఆలయ సిబ్బంది, శ్రీసోమేశ్వర, రాజరాజేశ్వరి సేవా ట్రస్ట్ సభ్యులు, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.


