జనగామ రూరల్: క్షయవ్యాధి నిర్మూలనకు అవగాహన తప్పనిసరిగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. కె.మల్లికార్జునరావు అన్నారు. మంగళవారం ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా పట్టణంలోని నెహ్రూ పార్క్ నుంచి బస్‌స్టాండ్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షయవ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి పూర్తి చికిత్స తీసుకోవడం ద్వారా వ్యాధిని పూర్తిగా నయం చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ అశోక్ కుమార్, టీబీ ప్రోగ్రాం ఆఫసర్, వైద్యులు శ్రీ హర్ష, శ్యామ్ కుమార్, కమల్‌హాసన్, ప్రభాకర్, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
టీబీ రహిత జిల్లా చేయాలి..
రఘునాథపల్లి: జిల్లాను టీబీ రహితంగా చేసేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మల్లికార్జున్‌రావు పిలుపునిచ్చారు. మండలంలోని ఖిలాషాపూర్ ఆరోగ్య ఉప కేంద్రంలో మంగళవారం టీబీ డేను పురస్కరించుకుని టీబీ ముక్త్ హారత్ అభియాన్ 2.0 కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య శిబరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ శాగ కవితఅశోక్, స్థానిక డాక్టర్ స్రవంతి, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సుధీర్, అశోక్, కమల్‌హాసన్, సీహెచ్‌ఓ రామకిషన్, సుజనారజని, మానస, మధు, జిల్లా టీబీ కంట్రోల్ సూపర్‌వైజర్లు చంద్రారెడ్డి, శ్రీనివాస్, అంజుకుమార్, సుమన్, ఖలీల్ పాల్గొన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కె.మల్లికార్జునరావు


