ఫోన్‌ పోతే పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఫోన్‌ పోతే పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి

Mar 25 2026 7:26 AM | Updated on Mar 25 2026 7:26 AM

డీసీపీ రాజమహేంద్ర నాయక్‌

జనగామ రూరల్‌: సెల్‌ఫోన్‌ పోతే పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్‌ సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయంలో క్రైం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లాలో మొబైల్‌ ఫోన్లు కోల్పోయిన బాధితులకు అందజేశారు. సీఈఐఆర్‌ పోర్టల్‌ను వినియోగించి, పోయిన, దొంగిలించబడిన మొబైల్‌ ఫోన్లను సమర్థవంతంగా ట్రేస్‌ చేసి అందించవచ్చన్నారు. ఈ పోర్టల్‌ ద్వారా దేశవ్యాప్తంగా మొబైల్‌ ఫోన్లను ట్రాక్‌ చేయడం సులభమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో వివిధ మండలాల ఎస్‌ఐలు, పొలీసు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement