● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
రఘునాథపల్లి: పదో తరగతి పరీక్ష కేంద్రంలోకి మొబైల్ ఫోన్‌తో ఎవరినీ లోనికి అనుమతించవద్దని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. సోమవారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్, సెయింట్ ఆల్ఫోన్సస్, సెయింట్ మేరీస్ పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. వైద్య శిబిరాన్ని పరిశీలించి, వేసవి దృష్ట్యా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులను సరిపడా అందుబాటులో ఉంచాలని సూచించారు. సిట్టింగ్ స్క్వాడ్, ప్లయింగ్ స్క్వాడ్‌లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. ప్రహరీ సరిగా లేని చోట భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


