సాగునీటి సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడుతా | - | Sakshi
Sakshi News home page

సాగునీటి సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడుతా

Mar 23 2026 8:44 AM | Updated on Mar 23 2026 8:44 AM

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి

జనగామ: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న దేవాదుల ఇరిగేషన్‌ పనులపై అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతానని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో క్వశ్చన్‌ అవర్‌ లేదా జీరో అవర్‌లో ఇరిగేషన్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. దేవాదుల వందశాతం కంప్లీట్‌ కోసం రూ.15 వేల కోట్లు అవసరమన్నారు. మల్లన్న సాగర్‌ నుంచి అన్ని చెరువులను నింపాల్సి అవసరం ఉందన్నారు. నియోజకవర్గంలో ఇరిగేషన్‌ పనులు 80శాతం పూర్తి కాగా, మరో రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తే పిల్ల కాలువలను బాగు చేసుకుంటామన్నారు. ఈ విషయమై గతంలోనే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వినతి చేయగా, అసెంబ్లీలో మరోసారి ప్రస్తావిస్తామన్నారు.

గ్యాస్‌ తంటాలు..హోటళ్ల బంద్‌

స్టేషన్‌ఘన్‌పూర్‌: కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల కొరతతో ఘన్‌పూర్‌ డివిజన్‌ కేంద్రంలోని పలు హోటళ్లు, మెస్‌లు, బిర్యానీసెంటర్లు, బేకరీలను నిర్వాహకులు బంద్‌ చేశారు. రెండురోజులుగా డివిజన్‌ కేంద్రంలోని పలు హోటళ్లు మూసి ఉండగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి పలు పనులపై ఘన్‌పూర్‌కు వచ్చిన వారు హోటళ్లు, మెస్‌లలో మధ్యాహ్న భోజనం, టిఫిన్లు చేసేవారు. అయితే ఇటీవల ఏర్పడిన గ్యాస్‌కొరతతో హోటళ్లు, మెస్‌లు బంద్‌ చేశారు. గ్యాస్‌ సకాలంలో అందక, కట్టెలపొయ్యిలపై వంటలు చేయలేక పలువురు చేసేదేమి లేక హోటళ్లను బంద్‌ చేశామని నిర్వాహకులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement