● వల్మిడి జాతరపై పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి సమీక్ష
పాలకుర్తి టౌన్: వల్మిడి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ఈనెల 27న శ్రీరామనవమి రోజున సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్య యశస్వినిరెడ్డి అధికారులను ఆదేశించారు. ఆది వారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు, ఆలయ నూతన కమిటీ సభ్యులతో శ్రీరామనవమి ఉత్సవాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయ పరిసరాల్లో శుభ్రత, తాగునీరు, విద్యుత్ దీపాలు, క్యూ, పార్కింగ్ ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అత్యవసర సేవలు అందుబాటులో ఉండేలా చూడాలననారు. అనంతరం శ్రీసీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో మార్కెట్ చైర్‌పర్సన్ మంజుల, తొర్రూరు మార్కెట్ చై ర్మన్ అనుమాండ్ల తిరుపతిరెడ్డి, ఆలయ ఈఓ సల్వాది మోహన్‌బాబు, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ పాలేపు సత్తయ్య, సర్పంచ్ నీరటి లక్ష్మీ చంద్రయ్య, రా పాక సత్యనారాయణ, గిరగాని కుమారస్వామి, ఎర్రబెల్లి రాఘవరావు, చెరుకు ప్రభాకర్, తండా వీరస్వామి, ప్రజాప్రదినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.


