జనగామ రూరల్: ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థులకు మెనూ ఉండాలని అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్ అన్నారు. శుక్రవారం మండలంలోని పసరమడ్ల గ్రామంలోని ఎస్టీ బాలుర హాస్టల్‌ను, పెంబర్తిలోని రెసిడెన్షియల్ స్కూల్, మహిళా డిగ్రీ కళాశాలను ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. ప్రిన్సిపాల్, వార్డెన్‌లకు భోజన తయారీ, హాస్టల్ నిర్వహణపై పలు సూచనలను చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ మహిపాల్‌రెడ్డి, ఎంజేపీ ప్రిన్సిపాల్ అనిత పాల్గొన్నారు.
ఎస్సీ హాస్టల్‌లో..
బచ్చన్నపేట: మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్‌ను జిల్లా అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ తనిఖీ చేశారు. కిచెన్, స్టాక్ రిజిస్టర్లు రైస్, పప్పు దినుసులు, ఇతర వంటసరుకులు, అటెండెన్స్ రిజిస్టర్‌లను పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఇంద్రవళ్లి హుస్సేన్, ఆర్‌ఐలు వంశీకృష్ణ, మునవర్, జీపీఓ సూర్య పలువురు పాల్గొన్నారు.


