టాస్క్‌ఫోర్స్ టీమ్స్
పరిశీలించాల్సిన అంశాలు
● ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు
● హాజరు, ఆహార నాణ్యత, పారిశుద్ధ్యం పరిశీలన
● 12 మండలాలు..ఆరుగురితో ప్రత్యేక టీంలు ఏర్పాటు
● ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
టాస్క్‌ఫోర్స్ టీమ్‌లు విద్యాసంస్థలను పరిశీలించాల్సి ఉంటుంది. సిబ్బంది హాజరు రిజిస్టర్ల పరిశీలన, ఆమోదించిన డైట్ చార్ట్ అమలు, విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యత, పరిమాణం, పరిశుభ్రత, స్టాక్ రిజిస్టర్లు (ధాన్యాలు, సరుకులు మొదలైనవి) వంటశాల పరిస్థితులు, నిల్వ విధానాలు ప్రాంగణ పరిశుభ్రత, మరుగుదొడ్లు, తాగునీటి ఏర్పాట్లు, పాఠశాల, హాస్టల్ నిర్వహణ, క్రమశిక్షణ వంటి పర్యవేక్షణ చేయాలి.


