రైతులు ఆధునిక పద్ధతులు అవలంబించాలి | - | Sakshi
Sakshi News home page

రైతులు ఆధునిక పద్ధతులు అవలంబించాలి

Mar 20 2026 8:00 AM | Updated on Mar 20 2026 8:00 AM

కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా

జనగామ రూరల్‌: రైతులు ఆధునిక పద్ధతులు అవలంబించాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సూచనల మేరకు జనగామ మండలం రైతులను సిద్దిపేట జిల్లాలోని నర్మెట గ్రామంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం, రిఫైనరీ యూనిట్‌ శంకుస్థాపన కార్యక్రమానికి మండలం నుంచి ఆయిల్‌పామ్‌ పండించే 51 మంది రైతులను కలెక్టరేట్‌ నుంచి బస్సులో తరలివెళ్లారు. కార్యక్రమంలో రూటు ఆఫీసర్‌లుగా జనగామ మండల ఏఈఓలు గిరి, రాజు, అనిల్‌ కుమార్‌ పాల్గొన్నారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నాణ్యమైన విద్య

వరంగల్‌ ఎంపీ కడియం కావ్య

స్టేషన్‌ఘన్‌పూర్‌: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని వరంగల్‌ ఎంపీ కడియం కావ్య అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026–27 సంవత్సరానికి గాను ప్రవేశాల కోసం రూపొందించిన బ్రౌచర్లను హన్మకొండలోని ఎమ్మెల్యే కడియం శ్రీహరి నివాసంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేతుల మీదుగా గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. 2026–27 సంవత్సరానికి గాను డిగ్రీ కోర్సులలో విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో చేరి తమ భవిష్యత్‌కు బలమైన పునాది వేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ స్టేషన్‌ఘన్‌పూర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ బత్తిని చంద్రమౌళి, అధ్యాపకులు నాగరాజు, సుమలత, అఖిల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement