కలెక్టర్‌కు మరో విశిష్ట అవార్డు
జనగామ రూరల్: జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి వేడుకల్లో జనగామ జిల్లా మరో విశిష్ట గౌరవాన్ని సాధించింది. ఎన్నికల నిర్వహణలో శిక్షణ, సామర్థ్యాభివృద్ధి అంశంలో చేసిన కృషికి గాను కలెక్టర్ రిజ్వాన్ బాషా అవార్డుకు ఎంపికయ్యారు. నేడు (ఆదివారం) హైదరాబాద్‌లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా అవార్డును కలెక్టర్ స్వీకరించనున్నారు. ఎన్నికల నిర్వహణలో భాగస్వామ్యం అయిన ప్రతీఒక్కరికి కలెక్టర్ అభినందనలు తెలిపారు. సమష్టి కృషితోనే జిల్లాకు ఈ అవార్డు దక్కిందన్నారు.
నేను మీ బంధువును.. టిఫిన్ చేద్దాం పదా అంటూ..
జనగామ రూరల్: నేను మీ బంధువును.. చాలా రోజుల తర్వాత కలిశాం టిఫిక్ చేద్దాం పదా అంటూ బ్యాంకుల వద్ద మోసాలకు పా ల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఏ ఎస్పీ పండేరీ చేతన్ నితిన్ తెలిపారు. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్‌కు చెందిన అడవి మీద నర్సింహులు గతంలో వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డాడు. ము ఖ్యంగా బ్యాంకులకు వద్ద అమాయకులను ఆసరా చేసుకుని వారితో బంధువునని, పరిచయస్తుడినని చెప్పి టిఫిన్, టీ తాగుతామని నమ్మించి తీసుకెళ్లి వారి నుంచి డబ్బులు తీసుకొని పరారవుతున్నాడు. జనవరి మెదటి వారంలో జిల్లా కేంద్రంలోని ఓ ఎస్‌బీఐలో ఓ వృద్ధుడు డబ్బులు డ్రా చేసుకుని బయటకు వచ్చాడు. తాను బంధవునవుతానని ఆ వృద్ధుడిని నమ్మించి టిఫిన్ చేద్దామని ఓ హోటల్ తీసుకెళ్లాడు. వృద్ధుడు చేతులు కడుక్కోవడానికి వెళ్లగానే డబ్బుతో ఉడాయించాడు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చే పట్టారు. శనివారం బస్టాండ్ సమీపంలో చోరీ చేయడానికి రాగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో గతంలో చేసిన నేరాలు ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడిని అరెస్ట్‌చేసి రూ. 70 వేల నగదు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. సీఐ సత్యనారాయణరెడ్డి తోపాటు ఎస్సై, సిబ్బందిని డీసీపీ, ఏఎస్పీ అభినందించారు.
కలెక్టర్‌కు మరో విశిష్ట అవార్డు


