‘బాలయేసు’ విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి
దేవరుప్పుల: బాలయేసు విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఎంపీడీఓ మేనక పౌడేల్ ఆకాంక్షించారు. శనివారం మండల కేంద్రంలోని బాలయేసు ఇంగ్లిష్ మీడియం హైస్కూల్‌లో ‘టెక్ ఇన్నోవేషన్ సమ్మిట్ –2025’ ప్రారంభోత్సవానికి పాఠశాల కరస్పాండెంట్ బ్రదర్ జేసురాజు అధ్యక్షత వహించగా ఎంపీడీఓ ప్రారంభించారు. ఎంపీడీఓ మేనక పౌడెల్ మాట్లాడుతూ.. ప్రయోగాత్మక విద్యతోనే సాంకేతిక పరిజ్ఞానం, నవీన ఆలోచనాత్మక ఆవిష్కరణలు సాధ్యమన్నారు. ఈ సందర్భంగా 9వ తరగతి విద్యార్థినులు ‘భారతదేశం 21 వ శతాబ్దం విదేశాంగ విధానపు రూపురేఖలు’, 7వ తరగతి విద్యార్థినులు ‘రక్షణ రంగంలో భారత సాంకేతిక ఆధిపత్యం’ అనే అంశం, 8వ తరగతి విద్యార్థినులు ‘నిత్యజీవితంలో కృత్రిమ మేధస్సు ప్రభావం’ అనే అంశంపై ప్రతిభను చాటిచారు. ఉపాధ్యాయులు మదన్‌మోహన్, మహేశ్, అనిత, మాధవి, ఎన్‌సీసీ పీఓ కృష్ణ పాల్గొన్నారు.
టెక్ ఇన్నోవేషన్ సమ్మిట్ –2025ను ప్రారంభించిన ఎంపీడీఓ మేనక పౌడేల్
‘బాలయేసు’ విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి


