పాల విప్లవకారుడు మర్రి పాపిరెడ్డి
జనగామ: జిల్లాలో పాల విప్లవం తీసుకొచ్చిన ఘనత దివంగత మర్రి పాపిరెడ్డిది అని, ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తు ఉండిపోతాయని విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.గోపాల్‌సింగ్ కొనియాడారు. జిల్లా కేంద్రంలోని పాలకేంద్రం ఆవరణలో శనివారం పాపిరెడ్డి ఆరో వర్ధంతి నిర్వహించారు. అనంతరం పాల ఉత్పత్తిదారుల అధ్యక్షులు కాసారపు ధర్మారెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు.. జిల్లాలో ప్రతీ మండలానికి మినీ పాలసేకరణ కేంద్రాలు, పాలసేకరణ భవనాలు ఏర్పాటు చేయడంలో పాపిరెడ్డి ఎంతో కృషి చేశారన్నా రు. కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షుడు నాగరాజు, విజయ డెయిరీ మ్యాక్స్ సొసైటీ ఉపాధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, మేనేజర్ నరేశ్, నర్మెట బీఎంసీ చైర్మన్ అంజనేయులు, మాజీ జిల్లా అధ్యక్షుడు సోమిరెడ్డి, నాగారం అధ్యక్షురాలు రాధ, దేవరుప్పుల మేనేజర్ లక్ష్మి, గోపాలమిత్ర సూపర్‌వైజర్ జయపాల్‌రెడ్డి, నాగరా జు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
గ్లోబల్ సమ్మిట్‌లో
చిందు యక్షగానం
దేవరుప్పుల: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్‌లో గడ్డం సమ్మయ్య బృందం జానపద సాంస్కృతికత విశిష్టతను తెలిపేలా చిందు యక్షగానం ప్రదర్శనలు ఇచ్చింది. శనివారం మండలంలోని అప్పిరెడ్డిపల్లె చిందు యక్షగాన బృందం హైదరాబాద్‌లోని గ్లోబల్ సమ్మిట్ ఉత్సవాల్లో భూకై లాస్ యక్షగాన ప్రదర్శనలు చేశారు. కార్యక్రమంలో గడ్డం శ్యామ్‌సుందర్, రఘుపతి, శ్రీపతి, వెంకన్న, లక్ష్మయ్య, హిమగిరి, రాసాల ప్రభాకర్, పిట్టల మహేశ్ పాల్గొన్నారు.
తక్కువ రెమ్యునరేషన్
అవమానకరం
జనగామ రూరల్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 10 రోజుల పాటు 8 రోజుల పోలింగ్, 2 రోజుల శిక్షణ విధులు నిర్వహించిన వేలాది మంది ఉపాధ్యాయులు, అధికారులకు స్వల్ప మొత్తం రెమ్యునరేషన్ ఇవ్వడం తీవ్ర అవమానకరమని తెలంగాణ రాష్ట్ర యూనైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కానుగంటి రంజిత్ కుమార్ విమర్శించారు. శనివారం జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పది రోజులకు గాను స్టేజ్–1 రిటర్నింగ్ అధికారి – కేవలం రూ.3,500, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికి 2,200, స్టేజ్–2 రిటర్నింగ్ అధికారికి 2,000 చెల్లిస్తున్నారని వివరించారు. కొన్ని జిల్లాల్లో ఈ రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదన్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్, కోశాధికారి చిక్కుడు శ్రీనివాస్, కృష్ణ , సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
పాల విప్లవకారుడు మర్రి పాపిరెడ్డి
పాల విప్లవకారుడు మర్రి పాపిరెడ్డి


