ఇబ్బందులు తలెత్తితే మా దృష్
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
బచ్చన్నపేట: మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో జరుగుతున్న మెటీరియల్ పంపిణీ సరిగ్గా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. శనివారం మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ శనివారం సందర్శించి మెటీరియల్ పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావులేకుండా సిబ్బందికి పోలింగ్ సామగ్రిని పక్కాగా అందించాలని, చెక్‌లిస్టు ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి అందిందా, లేదా అన్నది జాగ్రత్తగా పరిశీలించుకోవాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే తమ దృష్టికి తేవాలని ఆర్‌ఓలకు, మైక్రో అబ్జర్వర్‌లకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏసీపీ పండరి చేతన్ నితిన్, మండల స్పెషల్ అధికారి అంబికాసోని, ఎంపీడీఓ మమతాబాయ్, తహసీల్దార్ రామానుజాచారి, ఎస్సై ఎస్‌కే అబ్దుల్ హమీద్ తదితరులు పాల్గొన్నారు.
డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల పరిశీలన
నర్మెట: ఎన్నికల సందర్భంగా మండలకేంద్రంలోని మోడల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను శనివారం అదనపు కలెక్టర్ (ఎల్‌బీ) పింకేశ్ కుమార్ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఎంపీడీఓ కావ్య శ్రీనివాస్, ఎంపీఓ వెంకట మల్లికార్జున్, సిబ్బంది ఉన్నారు.
తరిగొప్పులలో..
తరిగొప్పుల: ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ సూచించారు.శనివారం మండలకేంద్రంలో ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఎన్నికల సజావుగా సాగేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ లావణ్య, తహసీల్దార్ మొగుళ్ల మహిపాల్‌రెడ్డి, డీటీ రామారావు తదితరులు పాల్గొన్నారు.
ఇబ్బందులు తలెత్తితే మా దృష్


