కాంగ్రెస్‌దే తొలివిడత
సర్పంచ్‌గా ఉపాధ్యాయ సంఘం నేత
బరిలో ఉంగరం గుర్తు పైచేయి
జనగామ: స్టేషన్‌ఘన్‌పూర్ మొదటి విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయదుందుభి మోగించారు. గురువారం జరిగిన పోలింగ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. 110 సర్పంచ్‌లు, 1,024 వార్డులకు గాను 228 ఏకగ్రీవం కాగా, 796 చోట్ల పోలింగ్ జరిగింది. ఐదు మండలాల పరిధిలో కాంగ్రెస్ దండయాత్ర కొనసాగగా, పార్టీ బలపరిచిన అభ్యర్థులు 110 గ్రామపంచాయతీల్లో 65 స్థానాల్లో విజయం సాధించి పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. లింగాలఘణపురం, రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, చిల్పూర్, జఫర్‌గఢ్ మండలాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయగా, బీఆర్‌ఎస్ అభ్యర్థులు 26 స్థానాల్లో మాత్రమే విజేత లుగా నిలిచారు. ఈ ఎన్నికల్లో 13 చోట్ల కాంగ్రెస్ రెబల్స్ గెలుపొందగా, ఐదుగురు స్వతంత్రులు ప్రజాభిమానం సంపాదించారు. ఒక గ్రామపంచాయతీ ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 10 జీపీల్ల్లో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం తెలిసిందే. ఇదిలా ఉండగా లింగాలఘణపురం మండలం నెల్లుట్ల ఫలితం రాత్రి 11.30 గంటలు దాటిని వెలువడలేదు.
రెబల్స్, స్వతంత్రుల సత్తా
రెబల్స్, స్వతంత్రులు కలిపి 17 స్థానాల్లో ఆధిపత్యం చాటడం గమనార్హం. ప్రధాన పార్టీల అభ్యర్థులుగా అంచనాలు వేసుకున్న పలువురు అనూహ్యంగా ఓటమిపాలు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రఘునాథపల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో స్వతంత్ర, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సమానంగా 210 ఓట్లు సాధించగా, అధికారులు టాస్ వేయగా, స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు.
రాత్రి వరకు లెక్కింపు
సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో రాత్రి 11:30 గంటల వరకూ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. అనంతరం పోలీసు బందోబస్తు నడుమ బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూంకు తరలించారు. గెలిచిన అభ్యర్థులు తమ అనుచ రులతో పటాకులు పేలుస్తూ సంబరాలు జరుపుకోగా, ఓటమి చెందిన వారిలో మాత్రం ఆవేదన, నిరాశ వాతావరణం నెలకొంది. ప్రచారంలో భారీగా ఖర్చు పెట్టి ఓటమి చవిచూసిన కుటుంబాలు తీవ్ర ఆవేదన గురయ్యారు. స్టేషన్‌ఘన్‌పూర్ పరిధిలో వెలువడిన ఈ ఫలితాలు జిల్లాలో రానున్న రెండో , మూడో విడత రాజకీయ సమీకరణలకు కొత్త మలుపు తీసుకుని రావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పురుషులదే ఆధిపత్యం
జఫర్‌గఢ్‌లో సర్పంచ్ ఎలక్షన్లలో ఈసారి గులాబీ దళానికి బోణి కుదరకపోవడం ఆ పార్టీ శ్రేణుల్లో నిరాశను రేకెత్తించింది. మరోవైపు లింగాల ఘణపురంలో బీఆర్ ఎస్ తన సత్తాను చాటుకుని 8 కీలక స్థానాల్లో గెలుపు సాధించడం పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. పోలింగ్ ఫలితాల్లో పురుషులదే స్పష్టమైన ఆధిపత్యం కనబడింది.
65 స్థానాల్లో కాంగ్రెస్..
26 చోట్ల బీఆర్‌ఎస్
దుమ్మురేపిన రెబల్స్, స్వతంత్రులు
లెక్కింపులో ఉత్కంఠ..
విజయంలో ‘ఉంగరం’ మెరుపులు..
జఫర్‌గఢ్‌లో బోణికొట్టని గులాబీ దళం
లింగాలఘణపురంలో సత్తాచాటిన బీఆర్‌ఎస్ మద్దతుదారులు
పోలింగ్.. విజయంలోనూ పురుషులదే
ఆధిపత్యం
జఫర్‌గఢ్: ఉపాధ్యాయ సంఘం నేతగా పని చేసిన గోపు సోమ య్య సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. తిడుగు గ్రామానికి చెందిన గోపు సోమ య్య ఏపీటీఎఫ్ డీటీఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పని చేయడంతో పాటు టీడీటీఎఫ్ రాష్ట్ర శాఖలో కీలక పాత్ర పోషించారు.
ఐదు మండలాల పరిధిలో ఉంగరం గుర్తుపైనే ఓటర్ల తీర్పు ఎక్కువగా పడింది. తరువాత స్థానాల్లో కత్తెర, బ్యాట్,ఫుట్‌బాల్ గుర్తులు నిలిచాయి. పలు గ్రామాల్లో స్థానిక సమీకరణాలు, గ్రామపెద్దల అనుబంధాలు, అంతర్గత విభేదాలు ఫలితాలను ప్రభావితం చేశాయి. ఓటర్ల ఉత్సాహంతో చలిని సైతం తట్టుకుని పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. మధ్యాహ్నం 1 గంట వరకు 90 శాతం పోలింగ్ పూర్తి కగా, పలుచోట్ల మూడు గంటల వరకూ పోలింగ్ సాగింది. పోలింగ్ ముగిసిన వెంటనే లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేశారు. బ్యాలెట్ పేపర్లు తెరి చే ప్రతిసారీ అభ్యర్థులు ఉత్కంఠతో శ్వాస ఆపి ఫలితాలను గమనించడంపై దృష్టిపెట్టారు.
కాంగ్రెస్‌దే తొలివిడత
కాంగ్రెస్‌దే తొలివిడత


