కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణుల వాగ్వాదం
స్టేషన్‌ఘన్‌పూర్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండలంలోని తాటికొండలో పోలింగ్ అనంతరం కౌంటింగ్ ఏజెంట్ల విషయమై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాటలు, ఘర్షణ వాతావరణం నెలకొంది. తాటికొండలో ఉదయం పోలింగ్ సమయం నుంచి స్వల్వ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలింగ్ కేంద్రానికి సమీపాన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు పోటాపోటీగా ప్రచారం చేపట్టారు. కాగా పోలింగ్ అనంతరం కౌంటింగ్ ఏజెంట్‌గా కాంగ్రెస్ పార్టీ నుంచి మొదట ప్రకటించిన వ్యక్తి కాకుండా మరో కాంగ్రెస్ నాయకుడు వెళ్తుండగా బీఆర్‌ఎస్ నాయకులు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాటలు జరిగాయి. ఒక దశలో ఘర్షణ వాతావరణం నెలకొనగా అక్కడ విధుల్లో ఉన్న ఎస్‌ఐ రాజేశ్ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినకపోవడంతో ఏపీపీ భీమ్‌శర్మ, సీఐలు వేణు, రాఘవేందర్ పోలీసు సిబ్బందితో గ్రామానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణులను నచ్చజెప్పి సర్దిచెప్పారు.
కోమటిగూడెంలోనూ..
మండలంలోని కోమటిగూడెంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలింగ్ కేంద్రానికి సమీపాన కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తుండగా బీఆర్‌ఎస్ వారు అడ్డుకోవడంతో స్వల్వ ఉద్రిక్తత నెలకొంది. కాగా పోలీసులు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
తాటికొండలో ఉద్రిక్త వాతావరణం


