నమిలిగొండ పోలింగ్ కేంద్రంలో సీపీ
స్టేషన్‌ఘన్‌పూర్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండలంలోని నమిలిగొండ గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని వరంగల్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన భద్రత ఏర్పాట్లతో పాటు ఎన్నికలు జరుగుతున్న తీరుతెన్నులను పరిశీలించారు. పోలింగ్ సజావుగా జరిగేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అక్కడ విధులలో ఉన్న ఎన్నికల అధికారులు, పోలీసులకు తగిన సూచనలు అందించారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా ప్రజలందరూ సహకరించాలన్నారు. సీపీ వెంట డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏసీపీ భీమ్‌శర్మ, సీఐ జి.వేణు తదితరులున్నారు.


