వేగం పుంజుకుని | - | Sakshi
Sakshi News home page

వేగం పుంజుకుని

Dec 12 2025 6:39 AM | Updated on Dec 12 2025 6:39 AM

వేగం

వేగం పుంజుకుని

జిల్లాలోని మొదటి విడత పోలింగ్‌ వివరాలు

జనగామ: జిల్లాలో మొదటి విడత సర్పంచ్‌ ఎన్నికలు ఓటర్ల ఉత్సాహంతో రికార్డు స్థాయిలో ముగిశాయి. స్టేషన్‌న్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలోని లింగాలఘనపురం, రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్‌, చిల్పూరు, జఫర్‌గఢ్‌ ఐదు మండలాల పరిధిలో 87.33 శాతం ఓటింగ్‌ నమోదు కావడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబించింది. 110 గ్రామపంచాయతీల పరిధిలో 1,66,497 మంది ఓటర్లు ఉండగా 1,45,404 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 88.73శాతంతో ముందంజలో నిలవగా, మహిళలు 85.97శా తంతో సమాన పోటీని చూపించారు. పోలింగ్‌ శాతంలో లింగాలఘణపురం మండలం 89.71 శాతంతో మొదటి స్థానంలో నిలువగా, చిల్పూరు మండలం 86.59 శాతంతో ద్వితీయ స్థానంలో నిలిచింది. ఉదయం నెమ్మదిగా సాగిన పోలింగ్‌, 10 గంటల తర్వాత వేగం పుంజుకుని మధ్యాహ్నానికి తారస్థాయికి చేరింది. మొత్తం మీద ఐదు మండలాల్లో ఓటింగ్‌ సరళి ఉత్కంఠ భరితంగా సాగింది.

మండలాల వారీగా..

ఐదు మండలాల్లో పురుష–మహిళా ఆధిక్యం ఇలా ఉంది. చిల్పూరులో పురుషులు 87.55శాతం, మహిళలు 85.66 శాతం ఓటింగ్‌తో స్వల్ప పురుష ఆధిక్యం కనిపించగా, స్టేషన్‌న్‌ఘన్‌న్‌పూర్‌లో 87.62శాతం పురుషులు, 84.61శాతం మహిళలు ఓటేసి అదే ధోరణి కొనసాగించారు. లింగాలఘణపురంలో మాత్రం 91.92శాతం పురుషులు నమోదు కాగా మహిళలు 87.59శాతం మాత్రమే ఓటు వేయగా, పురుషుల స్పష్టమైన ఆధిక్యం కనిపించింది. రఘునాథపల్లిలో 89.27శాతం పురుషులు, 86.82శాతం మహిళలు ఓట్లతో పోలింగ్‌లో ఆసక్తి కనిపించగా, జఫర్‌గఢ్‌ మండలంలో మాత్రం పురుషులు 86.90శాతం ఓట్లు నమోదు కాగా, 84.63 శాతంతో మహిళలు కాసింత వెనకబడ్డారు.

రెండు గంటలకోసారి..

జిల్లాలో మొదటి విడత సర్పంచ్‌ ఎలక్షన్ల పోలింగ్‌ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఉదయం 7–9 గంటల మధ్య ఓటింగ్‌ నెమ్మదిగా సాగి 34, 941 ఓట్లు పోలు కాగా(20.99,శాతం), 10 గంటల తర్వాత వేగం పెరిగింది. 10–11 గంటల మధ్య 79,786 ఓట్లు పోలవడంతో(47.92) బరిలో నిలిచిన అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అదే ఊపు కొనసాగించారు. దీంతో పోలింగ్‌ ముగిసే సమయం మధ్యాహ్నం 1 గంటల వరకు 73.40 శాతం మార్కు చేరుకుంది. అప్పటికే క్యూలో నిలబడ్డ ఓటర్లను కలుపుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు మొత్తం ఓట్ల సంఖ్య 1,45,404 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా, 87. 33శాతం ఓటింగ్‌తో మొదటి విడత పోలింగ్‌ ఉత్తేజభరితంగా ముగిసింది. గంట గంటకూ పోలింగ్‌లో వేగం మారడం గమనార్హం.

మండలం మొత్తం ఓటర్లు పురుషులు శాతం మహిళలు శాతం మొత్తం శాతం

చిల్పూరు 31,129 13,465 87.55 13,491 85.66 86.59

స్టే.ఘన్‌పూర్‌ 26,030 11,308 87.62 11,104 84.61 86.10

లిం.ఘణపురం 33,356 15,004 91.92 14,920 87.59 89.71

రఘునాథపల్లి 42,007 18,550 89.27 18,429 86.82 88.03

జఫర్‌గఢ్‌ 33,975 14,597 86.90 14,536 84.63 85,75

మొత్తం 1,66,497 72,924 88.73 72,480 85.97 87.33

వేగం పుంజుకుని1
1/6

వేగం పుంజుకుని

వేగం పుంజుకుని2
2/6

వేగం పుంజుకుని

వేగం పుంజుకుని3
3/6

వేగం పుంజుకుని

వేగం పుంజుకుని4
4/6

వేగం పుంజుకుని

వేగం పుంజుకుని5
5/6

వేగం పుంజుకుని

వేగం పుంజుకుని6
6/6

వేగం పుంజుకుని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement