కలెక్టరేట్ నుంచి పోలింగ్ కేంద్రాలపై నిఘా!
● వెబ్‌కాస్టింగ్ నిఘా విజయవంతం
జనగామ: జిల్లాలో తొలి విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా జిల్లా పరి పాలన కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. స్టేషన్‌ఘన్‌న్‌పూర్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో పోలింగ్ ప్రారంభమైన నిమిషం నుంచి ముగిసే వరకూ జిల్లా ఎన్నికల అబ్జర్వర్ రవికిరణ్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా స్వయంగా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాలను నిశితంగా పరిశీలించారు. వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ పర్యవేక్షణలో పోలీస్ శాఖ ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించింది. మొదటి విడత పోలింగ్‌ను శాంతియుతంగా ముగించిన ఎన్నికల ని ర్వాహక యంత్రాంగం ఇప్పుడు రెండో, మూడో విడతలకు మరింత సమగ్ర ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.


